బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి.. కుమార్తె వివాహ వేడుకలు ప్రారంభం!
- బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు
- త్వరలో సూర్యతేజ చిలుకూరితో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం
- ఘనంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహణ
- సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బండ్ల గణేశ్
సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఆయన భావోద్వేగంగా పోస్ట్ చేశారు. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేశ్ సంతోషం ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

