ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్యా బాధితుడన్న ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లీక్
- ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కాదన్న మెక్రాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలు మాట్లాడటమేమిటని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై మెక్రాన్ కూడా స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మెక్రాన్ అన్నారు. ఆ వ్యాఖ్యలు హుందాగా, ఆయన స్థాయికి తగినట్లుగా లేవని విమర్శించారు. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి బదులు పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, మెక్రాన్ భార్య అతనిని తోసేసినట్లు గత ఏడాది ఒక వీడియో వైరల్ అయింది.