'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
- 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ
- కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్
- తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం
తన సినిమా విడుదల విషయంలో కుట్ర జరుగుతోందని అన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన 'జన నాయగన్' సినిమా విషయంలో ఏదో జరుగుతోందని అన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కూడా ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు న్యాయం జరగాలని నేను ఎలాగైతే కోరుతున్నానో, తనకు కూడా న్యాయం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఎల్పీజీ సిలిండర్ల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే ఢిల్లీ విమానం ఎక్కుతారని, కానీ ఎల్పీజీ సిలిండర్ల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు పార్టీలు ఏకమయ్యాయని అన్నారు.