అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్
- ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్
- ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదన్న ఇరాన్
- మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్
ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ప్రకటన చేయగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదని పేర్కొంది.
వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామని ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ ఖండించింది. అమెరికా రాతి యుగం నాటి నేరాలను ఆధునిక యుగానికి తీసుకువస్తోందని ఆరోపించింది. చిన్నారుల హత్యలు, మానవత్వానికి మచ్చతెచ్చే నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది.