ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!
- ఇరాక్ గగనతలంలో హైడ్రామా
- డ్రోన్ ను వెంటాడిన వీడియో వైరల్
- కూల్చేశారా లేక దారిమళ్లించారా అన్నది వెల్లడించని సైన్యం
ఇరాన్ 'షాహెద్' డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించి, లక్ష్యాలను ఢీకొట్టి పేలిపోతాయి. గతంలో రష్యా వీటిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ తాజా ఘటన ఇరాన్, అమెరికా మధ్య వైరాన్ని మరింత పెంచేలా ఉంది. తమ గగనతలాన్ని ఇరు దేశాలు యుద్ధ క్షేత్రంగా మార్చవద్దని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ ఘటనపై ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చర్చిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, ఇరాన్ తన డ్రోన్లను సరిహద్దులు దాటించి ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో ఇరాక్ గగనతలంలో ప్రయాణిస్తున్న ఇరాన్ ‘షాహెద్’ ఆత్మహుతి డ్రోన్‌ను అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్-15 యుద్ధ విమానం, ఆ డ్రోన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించింది.