హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు
- హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం సహా పలువురికి ఫిర్యాదు
- ఇప్పటి వరకు రూ.600 కోట్ల అక్రమాలు జరిగాయన్న గురువారెడ్డి
- అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్లు బదిలీ కావడం కూడా అక్రమాల్లో భాగమేనని అన్నారు. ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆస్తులైన క్లబ్బులను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.