స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ
- తమ వైమానిక స్థావరాల్లో అమెరికా సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ
- సిసిలీలోని గోనెల్లా వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి ఇటలీ నో
- తమ బాంబర్ విమానాలు నిలపడానికి అమెరికా అనుమతి కోరినట్లు వార్తలు
సిసిలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరాన్ని అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో తమ బాంబర్ విమానాలను నిలపడానికి అమెరికా ఇటలీ అనుమతి కోరినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.