ఇరాన్ పూర్తిగా బలహీనపడేవరకు యుద్ధం కొనసాగించండి: ట్రంప్‌కు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి
- ట్రంప్‌ను ప్రైవేటుగా కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కథనం
- ట్రంప్‌ను కోరిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్
- ఇరాన్ నాయకత్వంలో మార్పు వచ్చేవరకు సైనికచర్య ఆగకూడదని విజ్ఞప్తి
నెల రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్ అంతగా బలహీనపడలేదని, కాబట్టి యుద్ధాన్ని కొనసాగించాలని ఆ దేశాలు కోరాయి. ఇరాన్ నాయకత్వంలో గణనీయమైన మార్పు రావాలని, అప్పటి వరకు సైనిక చర్య ఆగకూడదని ఆ దేశాల అధికారులు ప్రైవేటు సంభాషణలో భాగంగా ట్రంప్‌ను కోరినట్లు ఆ కథనం తెలిపింది.
అయితే, యుద్ధం ప్రారంభానికి ముందు తమకు సమాచారం ఇవ్వకపోవడం, యుద్ధం కారణంగా సంభవించే హెచ్చరికలను పట్టించుకోకపోవడంపై ఈ చర్చల సందర్భంగా ఆయా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని తెలుస్తోంది. యుద్ధం ఎలాగూ ప్రారంభమైనందున, టెహ్రాన్ పాలనను పూర్తిగా కూలదోయాలని, ఇది చరిత్రాత్మక అవకాశమని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని ఆ కథనం పేర్కొంది.