కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత
- కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ
- మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి
- గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ
- అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం హయాంలో 70 శాతం పూర్తయిందని మంత్రి అనిత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు వచ్చినా పాలకులకు వాటాలు, కమీషన్లపైనే దృష్టి ఉండేదని, భోగాపురం ఎయిర్పోర్టే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. ఇప్పుడు అలాంటి అవినీతికి తావులేకపోవడంతోనే ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై ఆమె ప్రశ్నలు సంధించారు. అమరావతిపై కౌన్సిల్లో తీర్మానం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారని, అసలు అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, తన పర్యటనలో భాగంగా మంత్రి అనిత విజయనగరం సబ్-జైలు, గ్రామీణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.