గర్ల్‌ఫ్రెండ్‌కు హార్దిక్ పాండ్యా ఖరీదైన కానుక.. ఇండియాలోనే తొలి లగ్జరీ కారు
- గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు హార్దిక్ పాండ్యా ఖరీదైన గిఫ్ట్
- రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ కారు బహుమతి
- ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి వి-క్లాస్ వాహనం ఇదే
- కొద్ది వారాల క్రితమే రూ. 12 కోట్లతో ఫెరారీ కొనుగోలు చేసిన పాండ్యా
- కొత్త కారుతో జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
కొద్ది వారాల క్రితమే హార్దిక్ పాండ్యా రూ. 12 కోట్ల విలువైన అల్ట్రా-లగ్జరీ ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు తన ప్రేయసి కోసం కొత్తగా విడుదలైన ఈ ప్రీమియం వాహనాన్ని బహుమతిగా అందించాడు. అత్యంత విశాలంగా, ఆధునికంగా ఉండే ఈ కారుతో హార్దిక్, మహికా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే, ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.