'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్
- రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాకు కాసుల వర్షం
- సినిమా ఆదాయంలో వాటా కావాలంటున్న పాక్ ప్రజలు
- తమ ప్రాంతం పేరు వాడినందుకే ఈ డిమాండ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరాచీలోని ల్యారీ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కింది. 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో భారత ఏజెంట్ ఒకరు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ఎలా నాశనం చేశాడన్నదే కథాంశం. తమ నగరం పేరును వాడుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారని, కాబట్టి ఆ ఆదాయంలో కొంత భాగాన్ని తమ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని ల్యారీ వాసులు కోరుతున్నారు.
ఈ డిమాండ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రాంతాన్ని వాడుకున్నందుకు చిత్ర నిర్మాతలు బాధ్యత వహించాలని వారు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది.