తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
- తిరుమలలో నిన్న భక్తుల రద్దీ అధికం
- శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,040 మంది భక్తులు
- హుండీ ద్వారా రూ. 3.18 కోట్ల ఆదాయం నమోదు
- 31 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పణ
భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లుగా నమోదైంది. అలాగే, 31,606 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని అంచనా.