ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
- కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణ
- ఇది ఒక అర్థం లేని సినిమా అని మండిపాటు
- దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇది ఒక అర్థం లేని సినిమా అని ధ్వజమెత్తారు. ఇలాంటి సినిమాల ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాలు యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరి దగ్గర అంత సమయం లేదని అన్నారు.