ఇరాన్‌పై దాడులు, యుద్ధం ముగింపుపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- అనుకున్న దానికంటే ముందుగానే టెహ్రాన్‌పై దాడులు ముగిస్తామన్న అమెరికా
- భూతల దాడులు చేయకుండానే లక్ష్యాలను సాధిస్తామని వెల్లడి
- ఇరాన్ సుంకాలను నిరోధించడమే అమెరికా తక్షణ కర్తవ్యమని వెల్లడి
హర్మూజ్ గుండా జరిగే చమురు రవాణా మీద ఇరాన్ సుంకాలు విధించకుండా నిరోధించడమే అమెరికా తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఈ సుంకాల కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ముగింపుపై చర్చల కోసం ఇరాన్ పాలకవర్గం తమకు పలుమార్లు సందేశాలు పంపించిందని వెల్లడించారు.
ఆ తర్వాత తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై మాత్రం స్పందించలేదని విమర్శించారు. ఇరాన్‌పై భూతల దాడులు చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే మాత్రం వాటిని ఎదుర్కోవడానికి అమెరికా తమ దళాలను ఇరాన్ చుట్టూ మోహరిస్తోందని మార్కో రుబియో తెలిపారు.