ఆటగాళ్ల రిటైర్మెంట్కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
- ఆటగాళ్లు రిటైర్ అవ్వడానికి వారి భార్యలే కారణమని యోగరాజ్ సింగ్ ఆరోపణ
- మహిళలు ఆటగాళ్ల కెరీర్‌కు అడ్డురాకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
- రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటారన్న యోగరాజ్
ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ మాట్లాడుతూ.. "ఆటగాళ్ల కెరీర్‌కు మహిళలు అడ్డురాకూడదు. ఇంట్లోని మహిళలు, భార్యలు వారికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెడతారు. రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటారు. అందుకే ఆటగాళ్లు కెరీర్‌ను మధ్యలోనే ముగిస్తున్నారు. భారత్‌లో 40 ఏళ్లు రాగానే వయసైపోయిందంటారు. 30 ఏళ్లకే మహిళలు తమ ఆకృతి కోల్పోతారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని, ఇక మేమేం చేయగలమని అంటారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.