ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్
- హ్యాక్ చేసినట్లు ప్రకటించుకున్న హండాలా టీమ్
- కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, ఫైళ్లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన హండాలా
- హండాలా టీమ్‌కు ఇరాన్‌తో సంబంధాలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈ-మెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని అమెరికా న్యాయశాఖకు అధికారి ఒకరు ధృవీకరించారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారికంగా స్పందించవలసి ఉంది. హండాలా టీమ్‌కు పాలస్తీనా అనుకూల హ్యాకర్లుగా పేరు ఉంది. ఈ హండాలా బృందాన్ని ఇరాన్ ప్రభుత్వ సైబర్ నిఘా విభాగం ఉపయోగించుకుంటోందనే వాదనలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మిచిగాన్‌కు చెందిన సంస్థను హ్యాక్ చేసినట్లు కూడా హండాలా టీమ్ ప్రకటించుకుంది.