నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు
- నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా
- ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి
- ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య
శీతాకాలంలో యూరప్ ఖండానికి రష్యా నుంచి గ్యాస్ సరఫరాలో నార్డ్ స్ట్రీమ్ది కీలకపాత్ర. జర్మనీకి సహజ వాయువును తీసుకువచ్చేందుకు బాల్టిక్ సముద్రంలో నార్డ్ స్ట్రీమ్ గొట్టపు మార్గాలను నిర్మించింది. 2022లో ఈ పైప్లైన్లలో లీకేజీలు కనిపించాయి. పేలుళ్ల కారణంగా లీకేజీలు వచ్చాయని భావించారు. పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ విధ్వంసం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా గతంలోనే ఆరోపించింది. ఇప్పుడు నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆ దేశ మంత్రి వ్యాఖ్యానించారు.