ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
- నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు
- జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్ పవన్ కల్యాణ్
- నటన పట్ల చరణ్ అంకితభావాన్ని, తపనను కొనియాడిన డిప్యూటీ సీఎం
- కుటుంబ బంధాలకు విలువనిస్తూ, పెద్దలను గౌరవించడం చరణ్ గొప్ప లక్షణాలని ప్రశంస
- చరణ్ మంచి గుణాలే అతడికి ఎల్లవేళలా శ్రీరామరక్ష అని పేర్కొన్న పవన్
"హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్! ప్రముఖ యువ కథానాయకుడు రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. ఇవే రామ్ చరణ్ కు ఎల్లవేళలా శ్రీరామరక్ష. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.