ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు
- అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని సమర్థించిన నాటో చీఫ్ మార్క్ రుట్టే
- ఇరాన్ క్షిపణి కార్యక్రమాలతో ఐరోపాకు ముప్పు ఉందని వెల్లడి
- నాటోపై ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో రుట్టే స్పందన
- పశ్చిమాసియాలో తమ కూటమి పాత్రను వివరించిన నాటో చీఫ్
ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఉద్రిక్తతల విషయంలో నాటో తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ విషయాన్ని అమెరికా ఎప్పటికీ మర్చిపోదని తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మార్క్ రుట్టే స్పందించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో నాటో కూటమి పాత్రను రుట్టే సమర్థించారు. గతంలో యుద్ధ సమయంలో టర్కీ వైపు దూసుకొచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో విజయవంతంగా అడ్డుకుందని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా, అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రతకు తమ కూటమి చర్యలు తీసుకుంటోందని వివరించారు.