ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల తీరుపై ట్రంప్ ఆగ్రహం
- ఇరాన్ మిలిటరీ నష్టపోయిందన్న ట్రంప్
- నాటో దేశాల నుంచి ఎలాంటి సహకారం లేదన్న ట్రంప్
- కీలక సమయంలో వారు ప్రవర్తించిన తీరు గుర్తుంచుకుంటామన్న ట్రంప్
వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల్లో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇలాంటి కీలకమైన సమయాల్లో వారు ప్రవర్తించిన తీరును ఎప్పటికీ మరిచిపోబోమని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ ఐదురోజుల పాటు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో చర్చల ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు.