జగన్‌పై కాంగ్రెస్ వివక్ష చూపడం వల్లే పార్టీ కనుమరుగు: తెలంగాణ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో మాట్లాడి ఉండాల్సిందన్న జీవన్ రెడ్డి
- వైఎస్ మరణం తర్వాత జగన్‌ను అధిష్ఠానం పట్టించుకోలేదని ఆరోపణ
- సీమాంధ్రలో పార్టీకి ఉనికి కూడా లేకుండా పోయిందన్న జీవన్ రెడ్డి
వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌ను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ పట్ల నాడు చూపిన వివక్ష ఫలితం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అనుభవిస్తోందని అన్నారు. ఆయనను దూరం చేసుకోవడం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి ఉనికి లేకుండా పోయిందని జీవన్ రెడ్డి అన్నారు.