అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన
- యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి
- విమాన వాహన నౌక కదలికలను పరిశీలిస్తున్నామని అంతకుముందే ఇరాన్ ప్రకటన
- ఆ తర్వాత గంటలోపు క్షిపణితో దాడి చేసిన ఇరాన్
యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక వైపు తాము క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. దీనిని అమెరికా ధృవీకరించవలసి ఉంది.
ఈ విమాన వాహక నౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఆ తర్వాత గంటలోపు క్షిపణి దాడి జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది.
అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ఇదివరకు కూడా ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దీనితో అది పని చేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల ఇరాన్ ప్రకటించగా, అమెరికా తోసిపుచ్చింది.