చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు
- పశ్చిమాసియా యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన చమురు సరఫరా
- పాకిస్థాన్‌లో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఈజిప్ట్‌లో ఇంధన ధరల పెరుగుదలతో ప్రజాగ్రహం
- పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
ఆఫ్రికా, ఆసియా దేశాలపై ప్రభావం..
ఈ ప్రభావం కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాల్లో ఇంధన ధరల పెరుగుదల విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగాలను దెబ్బతీస్తోంది. ఇది భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 120-130 డాలర్లకు చేరితే, అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఆయా దేశాల కరెన్సీ విలువ పతనానికి, అప్పుల భారం పెరగడానికి దారితీస్తుంది. మొత్తంగా ఈ యుద్ధ భారాన్ని సంపన్న దేశాల కంటే పేద, మధ్యతరగతి దేశాలే ఎక్కువగా మోస్తున్నాయని స్పష్టమవుతోంది.