ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్
- పలు ఫ్రాంచైజీలలో ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లు
- ఈ విషయం ఆయా ఫ్రాంచైజీలు చూసుకోవాలన్న ఐపీఎల్
- అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి
ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లు ఆడే విషయంలో ఫ్రాంచైజీలతో తుది నిర్ణయమని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో పాలకవర్గం చేసేది ఏమీ ఉండదని తెలిపింది. కొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా తమ జట్లతో కలవలేదని, ఇతర కారణాలతో మరికొందరు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని పేర్కొంది. ఈ అంశం ఫ్రాంచైజీలు చూసుకుంటాయని తెలిపింది. కానీ ఐపీఎల్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని తెలిపింది. క్రికెట్ అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.