ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ నిర్ణయం.. ఇజ్రాయెల్ ఏమన్నదంటే?
- యుద్ధానికి ఐదు రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
- యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమన్న ఇజ్రాయెల్
- తాము యుద్ధాన్ని విరమించలేదన్న ఇజ్రాయెల్
ట్రంప్ యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటిస్తే, ఇజ్రాయెల్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం. ఇరాన్‌తో రెండురోజుల పాటు చర్చలు జరిగాయని, ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, ఈ నేపథ్యంలో యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల ఫలితాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.