మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ
- అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు
- హామీలను అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- ఎన్నికల హామీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీల్లో ప్రజలకు ఒక్కటి కూడా చేరడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా కింద ఇంకా ఎకరానికి రూ.45 వేల కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉందని అన్నారు. దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. దీంతో విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.