థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్
- ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
- ఈ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి
- ఇరాన్ కోసం విరాళాలు సేకరించిన జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం ప్రజలు
భారత్ అధికారికంగా అందించిన సాయంతో పాటు, జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లా ప్రజలు చూపిన చొరవ ఈ ఘటనలో ప్రత్యేకంగా నిలిచింది. పురుషులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా అందరూ విరాళాలు సేకరించారు. మహిళలు తమ బంగారం, వెండి ఆభరణాలు, రాగి పాత్రలను ఇవ్వగా.. కొందరు తమ జీవనాధారమైన పశువులను సైతం విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. బుద్గాం వీధుల్లో ఇరాన్‌కు మద్దతుగా, ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ఇరాన్ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
పశ్చిమాసియాలో శాంతిని కోరుకునే భారత్.. ఈ కష్ట సమయంలో ఇరాన్‌కు సాయం చేయడం ద్వారా తన దౌత్య స్వాతంత్య్రాన్ని, మానవతా విలువలను చాటుకున్నట్లయింది. ముఖ్యంగా, బుద్గాం ప్రజల స్పందన భారతీయుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.