రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?
- చరణ్ 'పెద్ది' సినిమాలో ప్రత్యేక గీతంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ప్రచారం
- ఇంకా అధికారికంగా స్పందించని చిత్ర బృందం
- చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు 'పెద్ది'
ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని కొందరు అంటుండగా, కేవలం ఆమె మాత్రమే ఉంటుందని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం 'పెద్ది' చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.