కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!
- ఇతరుల సమస్యలు వినడానికి ఫీజు వసూలు
- సమస్య తీవ్రతను బట్టి రూ.250 నుంచి రూ.1,000 వరకు చార్జీలు
- ఖరీదైన థెరపీ కంటే ఇదే మేలంటున్న నెటిజన్లు
- ఒత్తిడి జీవితంలో ఇలాంటి సేవలకు పెరుగుతున్న ఆదరణ
ఆయన వద్ద సమస్యలకో రేట్ల పట్టిక కూడా ఉంది. చిన్న చిన్న సమస్యలు చెప్పుకోవాలంటే రూ.250, తీవ్రమైన ఆందోళనలు, కష్టాల గురించి మాట్లాడాలనుకుంటే రూ.500 చెల్లించాలి. ఎవరైనా తన వద్ద కూర్చుని ఏడుస్తూ తమ బాధను వెళ్లగక్కాలనుకుంటే గంటకు రూ.1,000 వసూలు చేస్తానని ఆయన చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఈ పని చేయడం లేదని, సైకాలజీ, ఫిలాసఫీ తనకిష్టమైన సబ్జెక్టులని, బాధలో ఉన్నవారికి కాస్త ఊరట కలిగించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆశ్చర్యకరంగా చాలామంది ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మనసు తేలికపడిందని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేలకు వేలు ఖర్చుపెట్టి థెరపిస్టుల వద్దకు వెళ్లే బదులు, ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మనసులోని భారాన్ని దించుకోవడం మేలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరి మాట మరొకరు వినే ఓపిక, సమయం లేకపోవడం వల్లే ఇలాంటి 'లిజనింగ్ సర్వీసెస్'కు ఆదరణ లభిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.