యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాం: శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార
- రెండు యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా విజ్ఞప్తి చేసిందన్న శ్రీలంక అధ్యక్షుడు
- యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు వెల్లడి
- శ్రీలంక పార్లమెంటుకు తెలిపిన అధ్యక్షుడు అనురకుమార
ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంటుకు తెలిపారు. మార్చి 4 నుంచి 8 తేదీల మధ్య జిబూటీలోని ఒక స్థావరం నుంచి రెండు క్షిపణి సామర్థ్యం కలిగిన విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించేందుకు అమెరికా అనుమతి కోరిందని అనురకుమార తెలిపారు. కానీ అమెరికా అభ్యర్థనను తిరస్కరించామని వెల్లడించారు.
ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తటస్థ వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని అన్నారు. పశ్చిమాసియా యుద్ధం ఎన్నోసవాళ్లను విసురుతోందని, అయినప్పటికీ ఏ పక్షానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. జిబూటీలోని ఒక స్థావరం నుంచి 8 యాంటీషిప్ మిసైల్స్‌తో కూడిన రెండు యుద్ధ విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా భావించిందని అన్నారు.