యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె
- పక్కనే కూర్చున్న కింగ్ జాంగ్ ఉన్
- గత కొన్నాళ్లుగా తరచూ తండ్రితో కలిసి కనిపిస్తున్న కిమ్ కూతురు
- ఫొటోలు విడుదల చేసిన అధికార మీడియా
తాజాగా, కుమార్తె యుద్ధ ట్యాంకును నడుపుతుండగా, కిమ్ జాంగ్ ఉన్ ఆమె పక్కనే కూర్చున్నారు. ఆ ట్యాంకర్‌పై మరికొంతమంది సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ విడుదల చేసింది. గత కొన్నాళ్లుగా కిమ్ పక్కనే తరచూ కుమార్తె కనిపిస్తున్నారు.
ఉత్తరకొరియా సైనిక దళంలోకి కొత్త యుద్ధ ట్యాంక్‌లు వచ్చాయి. గురువారం ఆ ట్యాంక్‌లను కిమ్ పరిశీలించారు. డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను ఆ ట్యాంక్‌తో పేల్చవచ్చు.