అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు
- మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తున్న నిందితులు
- ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి చిన్నారులుగా చాట్ చేసిన పోలీసులు
- ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
- అందులో ఒకరు తెలుగు యువకుడిగా గుర్తింపు
అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా న్యూమెక్సికోలోని శాంటాఫే నగర పోలీసులు ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచారు. పోలీసులు కూడా చిన్నారులుగా నిందితులతో పరిచయం చేసుకుని చాటింగ్ చేశారు. ఈ చాటింగ్ సందర్భంగా చిన్నారులను లైంగిక ప్రలోభాలకు గురిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.