మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు.. వీడియో ఇదిగో!
- ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారని ప్రచారం
- ఇటీవల కాఫీ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్
- అది ఏఐ సాయంతో తయారుచేసిన వీడియో అంటూ ప్రచారం
దీంతో నెతన్యాహు ఓ కాఫీ షాపుకు వెళ్లి కాఫీ తాగుతూ వీడియో విడుదల చేశారు. తన చేతి వేళ్లు చూపిస్తూ.. ‘‘వేళ్లు లెక్కిస్తున్నారా.. ఇదిగో చూడండి. నా చేతికి ఐదు వేళ్లే ఉన్నాయి కదా. బాగా చూడండి. నా చేయి చాలా అందంగా ఉంది కదా’’ అంటూ జోకులు పేల్చారు. యుద్ధం జరుగుతున్న వేళ శత్రువు చేసే అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు.
అయితే, అది కూడా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వీడియోనేనని ఎలాన్ మస్క్ కు చెందిన ‘గ్రోక్ ఏఐ’ పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా నెతన్యాహు ఓ హిల్ స్టేషన్ కు వెళ్లి అక్కడున్న సందర్శకులను కలిసి మాట్లాడారు. ‘మనందరం కలిసికట్టుగా ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో గెలుస్తున్నాం’ అంటూ నెతన్యాహు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై కూడా పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.