పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
- అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
- జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
- లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
- రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
- వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఎవరికీ సాయం చేయకూడదనే డీఎన్ఏ జగన్‌ది కాబట్టే, కన్నతల్లిని, చెల్లిని కూడా మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అడ్డగోలుగా అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి విమర్శించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వచ్చాక ఐసీయూలోకి తీసుకొచ్చామని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో సౌకర్యవంతమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని నిమ్మల రామానాయుడు వివరించారు.