అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
- పదేళ్లుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలో నివాసం
- తీవ్ర విషాదంలో వరంగల్‌లోని కుటుంబ సభ్యులు
- మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు
గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రాణిస్తూ అక్కడే స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం వర్జీనియాలో నివాసముంటోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న రాకేశ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.