నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్
- హర్మూజ్ తెరిచేందుకు తమతో కలిసి రావాలని పిలుపు
- యుద్ధ నౌకలను పంపించాలని నాటో దేశాలకు సందేశం
- నాటో తన బాధ్యత నెరవేర్చకుంటే భవిష్యత్తు కష్టమేనని హెచ్చరిక
హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ‘‘అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే’’ అని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, ఇరాన్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దానిని అడ్డుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది.