రంజాన్ వేళ పాకిస్థాన్లో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- పాకిస్థాన్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- లీటర్ పై రూ.55 పెంపు
- రంజాన్ మాసంలో ప్రజలపై పెరిగిన ఆర్థిక భారం
- పెరిగిన రవాణా ఛార్జీలు, నిత్యావసరాల ధరలు
- మధ్యతరగతి, రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావం
రంజాన్ మాసంలో సాధారణంగానే కుటుంబ బడ్జెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సింది పోయి, ధరలు పెంచడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈద్ పండుగ ఖర్చుల కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ భారం వారి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తోందని నివేదిక పేర్కొంది.
పాకిస్థాన్ ఎక్కువగా ఇంధన దిగుమతులపై ఆధారపడటంతో అంతర్జాతీయ మార్పులు దేశీయ ధరలను కుదిపేస్తున్నాయి. ధరల పెంపు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే దేశంలోని కరాచీ, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో రవాణా ఛార్జీలు పెరిగాయి. దీంతో ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగాయి. ఇంధన ధరలు పెరిగిన వెంటనే వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచుతున్నారని, మరోవైపు పెషావర్లో పెట్రోల్ అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గినట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.
గమనిక: పైన తెలిపిన ధరలు పాకిస్థానీ రూపాయల్లో.