అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం
- అసోంలోని కామాఖ్య పుణ్యక్షేత్రం-చర్లపల్లి మధ్య రైలు సేవలు
- ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీతో ప్రయాణం
- ఏపీ, తెలంగాణలలోని పలు స్టేషన్లలో ఆగనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
ఈ రైలు మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం పట్టణం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతూ, అక్కడి నుంచి చర్లపల్లికి చేరుకుంటుంది.