మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లి.. కేరళ ఆలయంలో ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో వివాహం
- కుంభమేళా ఫొటోలతో పాప్యులర్ అయిన మోనాలిసా
- ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వరించిన బ్యూటీ
- కేరళ ఆలయంలో భారీ భద్రత మధ్య వివాహ వేడుక
- ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోల వైరల్
- భద్రతా కారణాలతో సొంత రాష్ట్రం వదిలి కేరళలో వివాహం
ఈ జంటకు ప్రాణహాని ఉందన్న సమాచారంతో కేరళ పోలీసులు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పోలీసులు పహారా కాస్తుండగా హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అత్యంత సరళంగా జరిగింది. ఫర్మాన్ ఖాన్ కూడా ఈ వివాహానికి హిందూ పద్ధతులను అనుసరించడం విశేషం.
మోనాలిసా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగానే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు ఈ జంటను అభినందిస్తుండగా, మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, తమ ప్రేమ గెలిచినందుకు సంతోషంగా ఉన్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలని మోనాలిసా సోషల్ మీడియా ద్వారా కోరారు.