ఇండియన్ మెడిసిన్‌కు ఫిదా అయిన అమెరికన్.. వీడియో వైరల్
- పశ్చిమ దేశాల కన్నా భారత వైద్యం గొప్పదన్న అమెరికన్ క్రియేటర్
- భారత్‌లో అనారోగ్యం పాలై, కోలుకున్న తన అనుభవాన్ని పంచుకున్న చార్లీ
- ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కలయిక అద్భుతమంటూ ప్రశంస
- ఇండియన్ మెడిసిన్ ‘గాడ్-టియర్’ అంటూ కితాబు
- చార్లీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో
గత 148 రోజులుగా తాను భారత్‌లో నివసిస్తున్నానని, ఇటీవల అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రికి వెళ్లానని చార్లీ తన వీడియోలో తెలిపాడు. "పశ్చిమ దేశాల వైద్యం కన్నా భారత వైద్యం ఎందుకు గొప్పదో నేను మీకు చెబుతాను" అంటూ తన అనుభవాన్ని వివరించాడు. రాజస్థాన్ పర్యటనలో ఉన్నప్పుడు తనకు గొంతునొప్పి (స్ట్రెప్ థ్రోట్) వచ్చిందని, అయితే భారత్‌లో ఆసుపత్రికి వెళ్లడం చాలా సులభమని తెలియక రిషికేశ్ వచ్చేవరకు వైద్యం తీసుకోలేదని, అది తాను చేసిన పెద్ద తప్పిదమని అన్నాడు.
భారత్‌లో లభించే యోగి కంఠిక పిల్స్, దగ్గు మందులు అద్భుతంగా పనిచేస్తాయని చార్లీ కొనియాడారు. "ఇలాంటివి అమెరికాలో దొరకవు. ఇక్కడి దగ్గు మందుల్లో వాడే పదార్థాలు చాలా మేలైనవి" అని అభిప్రాయపడ్డాడు. భారతీయులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారని, చాలామంది ఇళ్లలో ఉండే ఆయుర్వేద గృహ చిట్కాలు ఎంతగానో సహాయపడతాయని అన్నాడు. "భారత్‌లో ఉంటే మీ స్నేహితులే మీకు సహజసిద్ధమైన మందులు ఇస్తారు. నా స్నేహితుడు ఇచ్చిన సహజమైన విక్స్‌లాంటి బామ్‌ను వాడాను. ఫార్మసీ లేదా ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లకుండానే ఇక్కడ వైద్యం అందుతుంది" అని ఎవాన్స్ వివరించాడు.
"భారత వైద్యం నిజంగా గాడ్-టియర్ (దైవ సమానం). అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఇంటి చిట్కాలు, ఆయుర్వేదం, ఆధునిక మందులు అన్నీ కలిసి పనిచేయడం నాకు కనువిప్పు కలిగించింది" అని చార్లీ తన వీడియోకు క్యాప్షన్ జతచేశాడు. ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చార్లీ అభిప్రాయంతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.
అమెరికాలో లాగా కాకుండా భారత్‌లో సులువుగా, తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని పలువురు కామెంట్లు చేశారు. "భారత్‌లో నేరుగా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. కానీ అమెరికాలో నెలల తరబడి వేచి చూడాలి, ఇన్సూరెన్స్ చాలా ఖరీదు" అని ఒక యూజర్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వంటి విభిన్న వైద్య విధానాలు అందుబాటులో ఉండటం భారత్ ప్రత్యేకత అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
More Telugu News
ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు
![]()
గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!
![]()
మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన
![]()
స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
![]()
భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!
![]()
కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
![]()
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి
![]()
ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ
![]()
ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!
![]()
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు
![]()
ఏపీలో '108' సేవలకు కొత్త రూపు
![]()
తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!
![]()
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన
![]()
'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్
![]()
రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
![]()