ఇరాన్‌పై దాడి ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.7 వేలు పెరిగిన బంగారం ధర
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్‌లో రూ.1,73,500 పలికిన 24 క్యారెట్ల పసిడి ధర
- రూ.3 లక్షలకు చేరువైన కిలో వెండి ధర
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,500కి, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,54,650కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.3 లక్షలను సమీపించింది. ఈరోజు వెండి ధర భారీగా పెరిగి రూ.2,99,000కు చేరుకుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ఔన్సు ధర 5,296 డాలర్లు పలకగా, వెండి ఔన్సు 98.82 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.