చౌధరీ అస్లాం భాయ్.. ధురంధర్-2 కోసం ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్
- సంజయ్ దత్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి నారా లోకేశ్
- ఏపీపై మీ విజన్, స్పష్టత అద్భుతమన్న సంజయ్ దత్
- మీకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందని నటుడి హామీ
- ధురంధర్ 2 సినిమాను ప్రస్తావిస్తూ లోకేశ్ రిప్లయ్
సంజయ్ దత్ తన ట్వీట్లో.. "లోకేశ్ గారు, మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో మీకున్న విజన్, స్పష్టత చూసి నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. మీకు నా వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని పేర్కొన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభ్యున్నతికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సంజయ్ దత్ ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. "చౌధరీ అస్లాం భాయ్.. నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. 'ధురంధర్ 2' సినిమా కోసం, అందులో మీ ఓజీ స్వాగ్ చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రీట్వీట్ చేశారు. లోకేశ్ సరదాగా సంజయ్ దత్ సినిమా పాత్రను ప్రస్తావిస్తూ రిప్లై ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై వీరిద్దరి మధ్య నిన్న ముంబైలో చర్చలు జరిగాయి.
ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ధురంధర్'లో సంజయ్ దత్ చౌధరీ అస్లాం అనే ఎస్పీ పాత్రను పోషించడం తెలిసిందే.