ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది.. ఈ రాంబాబుకు కూడా వస్తుంది: అంబటి రాంబాబు
- ఆవేశంలో అన్న మాటలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశానన్న అంబటి
- ఎన్ని కేసులు పెట్టినా, చావనైనా చస్తాను కానీ తగ్గనని స్పష్టీకరణ
- తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌తో భేటీ అయ్యానని వెల్లడి
మీడియా సమావేశానికి ముందు, ఆయన తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించారని జగన్‌కు వివరించారు. దీనిపై స్పందించిన జగన్, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు.
మీడియాతో మాట్లాడుతూ, తాను ఆవేశంలో అన్న మాటలపై రియలైజ్ అయ్యానని తెలిపారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ‘ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. చావనైనా చస్తాను గానీ, తగ్గే ప్రసక్తే లేదు’ అని పేర్కొన్నారు.