కాన్సెప్ట్ బాగుంది కానీ... అందులో వాస్తవం లేదు: దర్శకుడు క్రిష్
- దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తదుపరి మూవీపై సోషల్ మీడియాలో వదంతులు
- వదంతులపై తనదైన శైలిలో స్పందించిన క్రిష్ జాగర్లమూడి
- తన కొత్త సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానన్న క్రిష్ జాగర్లమూడి
గమ్యం మూవీతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్, ఆ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి ఆలోచనాత్మక చిత్రాలు, అలాగే కథానాయకుడు (ఎన్టీఆర్) వంటి బయోపిక్‌ను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన హరి హర వీరమల్లు, ఘాటి మూవీలు గత ఏడాది విడుదలయ్యాయి.