అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా?: బొత్స సత్యనారాయణ
- శాసనమండలిలో అంబటి అంశంపై మాట్లాడిన బొత్స
- అంబటిపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా స్పందించారని వ్యాఖ్య
- అంబటిని వేధించిన వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
అంబటిపై దాడి చేయడం వల్లే ఆయన ఘాటుగా స్పందించారని బొత్స అన్నారు. ఆయన విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే క్షమాపణ చెప్పారని తెలిపారు. అంబటిని వేధించిన వారంతా భవిష్యత్తుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడి చేయడం సరికాదని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై కూడా దాడి చేశారని విమర్శించారు. మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.