కొన్ని పరిణామాల వల్ల సినిమా వేడుకల్లో మహిళలు చీరలు కడుతున్నారు: నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- 'హే భగవాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నరేశ్ వ్యాఖ్యలు
- వాలంటైన్ వీక్లో భాగంగా హగ్ డే సందర్భంగా పురుషులను హగ్ చేసుకున్న నరేశ్
- హగ్ చేసుకోవాలనుకున్నాను కానీ మీరు లక్షణంగా చీరలో వచ్చారని వ్యాఖ్య
వాలంటైన్ వీక్లో భాగమైన 'హగ్ డే' సందర్భంగా నరేశ్ వేదికపై ఉన్న పురుషులను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈ చిత్రం హీరోయిన్ శివాని, యాంకర్ స్రవంతి వద్దకు వెళ్లిన నరేశ్ మాట్లాడుతూ, మిమ్మల్ని కూడా హగ్ చేయాలని వచ్చాను... కానీ మీరు లక్షణంగా చీరలు ధరించి వచ్చారు, కొన్ని పరిణామాల వల్ల చాలామంది సినిమా వేదికలకు చీరలు ధరించి వస్తున్నారు అని అన్నారు. కాగా ఈ చిత్రంలో యాంకర్ స్రవంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.