వీళ్లే యాక్షన్, కట్ కూడా చెప్పేట్టున్నారు: ఊహాగానాలపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు
- ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్
- అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఊహాగానాలు
- ఖండించిన అనిల్ రావిపూడి
ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, "నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు. ఇంకా నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన, పూర్తి వివరాలు మీకు అందిస్తాం" అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తదుపరి చిత్రం ఇదేనంటూ ఊహాగానాలు బయల్దేరాయి. అనిల్ రావిపూడి గత చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఆయన తర్వాతి సినిమాపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోల పేర్లు, రకరకాల కథలు ప్రచారంలోకి వస్తున్నాయి.