ఇళయరాజా బయోపిక్‌పై వదంతులు ..స్పందించిన ధనుష్ టీమ్
- ఇళయరాజా బయోపిక్ నుంచి దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తప్పుకున్నారంటూ రూమర్స్
- ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న ధనుష్ టీమ్
- డీసీ సినిమా పూర్తవ్వగానే అరుణ్ .. ఇళయరాజా బయోపిక్ షూటింగ్ ను పునః ప్రారంభిస్తారని వెల్లడి
ధనుష్ ప్రధాన పాత్రలో ఇప్పటికే ఈ బయోపిక్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ ‘డీసీ’ సినిమాను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ ఇక ఇళయరాజా బయోపిక్‌కు దర్శకత్వం వహించట్లేదంటూ పుకార్లు షికారు చేశాయి. ధనుష్ - అరుణ్ కాంబినేషన్‌లో గతంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలైంది. ఇక ధనుష్ ప్రస్తుతం ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్), ‘కర’ మూవీల్లో నటిస్తున్నారు.