రంజీలో 299 వద్ద ఔటైన్ బెంగాల్ ఆటగాడు.. ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు
- 596 బంతుల్లో 299 పరుగులు చేసిన బెంగాల్ ఆటగాడు సుదీప్ కుమార్
- ఆంధ్ర బౌలర్ షేర్ రషీద్ బౌలింగులో ఔటైన సుదీప్ కుమార్
- 'బాధపడకు' అంటూ ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు
సుదీప్ ఔటయ్యాక తీవ్ర నిరాశతో పెవిలియన్కు వెళుతుండగా, ఆంధ్ర ఆటగాళ్లు 'బాధపడకు' అంటూ ఓదార్చారు. ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో 299 పరుగుల వద్ద ఔటైన తొలి భారత బ్యాటర్ సుదీప్ కావడం గమనార్హం. 1991లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ క్రోవ్ శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో 299 పరుగుల వద్ద ఔటయ్యాడు.