సీఎం పదవిపై డీకే నిర్వేదం
- ఆ సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని వ్యాఖ్య
- ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి
- తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన డీకే శివకుమార్
ఇటీవల ఈ గడువు ముగియడంతో సీఎం మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హైకమాండ్ మాత్రం సిద్ధూను కొనసాగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే శివకుమార్ స్పందించారు. శనివారం ఆయన మీడియా ముందు నిర్వేదం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. సీఎం మార్పు విషయంలో తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డీకే స్పష్టం చేశారు.